27 నుంచి పుదువైలో విమానసేవలు

Published: Fri, 11 Mar 2022 10:38:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
27 నుంచి పుదువైలో విమానసేవలు

పుదుచ్చేరి: పుదుచ్చేరి లాస్‌పేట విమానాశ్రయం నుంచి విమాన సేవల పునరుద్ధరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27వ తేది నుంచి విమానసేవలు పునఃప్రారంభం కానున్నాయి. 2013లో స్పైస్‌ జెట్‌, 2015లో ఎయిర్‌ ఇండియా లాస్‌పేట విమానాశ్రయం నుంచి బెంగుళూరుకు విమాన సేవలు ప్రారంభించాయి. తగిన స్పందన లేకపోవడంతో ఈ సేవలు నిలిపివేశారు. అనంతరం ‘ఉడాన్‌’ పథకంలో ప్రయాణికుల సగం ఛార్జీలను కేంద్రప్రభుత్వం భరించి, విమాన సంస్థలకు చెల్లిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద 2017 ఆగస్టులో స్పైస్‌ జెట్‌ సంస్థ హైదరాబాద్‌, బెంగుళూరుకు విమాన సేవలు ప్రారంభించి, అనంతరం బెంగుళూరుకు సేవలు నిలిపివేసింది. చివరగా 2020 మార్చి అనంతరం పుదుచ్చేరి నుంచి విమానాలు నడపలేదు. రెండేళ్ల అనంతరం ఈ నెల 27 నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌లకు విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.