సౌదీలో అనూహ్య ఘటన.. కేవలం 30 పోస్టులకు ఇన్ని వేల దరఖాస్తులా!

ABN , First Publish Date - 2022-02-18T14:38:08+05:30 IST

సౌదీ అరేబియాలో 30 ట్రైన్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏకంగా 28వేల మంది మహిళలు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవడం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధిం

సౌదీలో అనూహ్య ఘటన.. కేవలం 30 పోస్టులకు ఇన్ని వేల దరఖాస్తులా!

ఎన్నారై డెస్క్: సౌదీ అరేబియాలో 30 ట్రైన్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏకంగా 28వేల మంది మహిళలు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవడం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహిళల పట్ల తన వైఖరిని గత కొన్ని రోజులుగా సౌదీ అరేబియా ప్రభుత్వం మార్చుకుంటూ వస్తోంది. మహిళ విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. మగతోడు లేకుండా ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతి ఇవ్వడంతోపాటు ట్యాక్సీలు, ట్రైన్‌లు నడిపేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే సౌదీలో తాజాగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ట్రైన్‌లు నడిపేందుకుగాను మహిళా డ్రైవర్ల కోసం స్పానీష్ రైల్వే ఆపరేటర్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి. 30 మహిళా ట్రైన్ డ్రైవర్ పోస్టులకు ఏకంగా 28వేల మందికిపైగా అప్లై చేసుకున్నారు. అయితే, ఇంగ్లిష్ లాగ్వేంజ్ స్కిల్స్, అకాడమిక్ సర్టిఫికెట్లను పరిశీలించిన తర్వాత అర్హులైన అభ్యర్థుల నుంచి 30 మందిని ఎంపిక చేయక చేయనున్నట్టు సదరు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 30 పోస్టులకు ఎంపికైన మహిళలు తమ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మక్కా-మదీనా మధ్య ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపనున్నారు. 




Updated Date - 2022-02-18T14:38:08+05:30 IST