మూడ్రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారుల మృతి.. ఒకే కుటుంబంలో దారుణం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2022-04-14T22:28:04+05:30 IST

ఆ ముగ్గురు కుర్రాళ్లు అన్నాదమ్ములు.. ఒకే కుటుంబానికి చెందిన వారు.. ముగ్గురూ ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు..

మూడ్రోజుల వ్యవధిలోనే ముగ్గురు చిన్నారుల మృతి.. ఒకే కుటుంబంలో దారుణం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ఆ ముగ్గురు కుర్రాళ్లు అన్నాదమ్ములు.. ఒకే కుటుంబానికి చెందిన వారు.. ముగ్గురూ ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు.. వారిలో ఒకరు ఇంట్లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.. దీంతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.. వారి మరణాలకు కారణాలు ఏంటనేది వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు.. వారి మరణాలకు గల కారణాల గురించి పరిశోధన సాగిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.


రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా స్వరూప్‌గంజ్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు మూడు రోజుల్లో వరుసగా మృతి చెందడంతో కలకలం రేగింది. వీరిలో విపుల్ (10) ఈ నెల పదో తేదీన ఇంట్లో మరణించగా, రాజేష్ (12), సంతోష్ (15) అహ్మదాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరి మరణాలకు కారణాలేంటనేది వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అంతుబట్టని వ్యాధి ప్రబలిందని గ్రామస్థులు భయపడుతున్నారు.


విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. స్వరూపగంజ్‌లోని ఆసుపత్రికి వెళ్లి వైద్య బృందంతో చర్చించారు. బాధిత గ్రామానికి వైద్య బృందాన్ని పంపి సర్వే చేయించారు. గ్రామంలో ఎంత మంది చిన్నారులు, ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం, వైద్యులు ఆ మరణాలకు కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నారు. 

Updated Date - 2022-04-14T22:28:04+05:30 IST