జిగ్నేష్ మేవానీకి 3 రోజుల పోలీసు కస్టడీ

ABN , First Publish Date - 2022-04-22T19:37:21+05:30 IST

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్వీట్లు అరెస్టయిన గుజరాత్‌ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి 3 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ అసోంలోని

జిగ్నేష్  మేవానీకి 3 రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేసి అరెస్టయిన గుజరాత్‌ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి 3 రోజుల పోలీసు కస్టడీ విధిస్తూ అసోంలోని కోక్రఝర్ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. పోలీసులు 14 రోజుల కస్టడీ కోరినప్పటికీ మూడు రోజుల సమయం మాత్రమే ఇస్తూ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిర్ణయం తీసుుకున్నారు. కోక్రఝర్‌లో జిగ్నేష్ మేవానీకి చెందిన న్యాయవాది ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన లీగల్ టీం ఇప్పటికే జిగ్నేష్ మేవానీ ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురయింది. దీంతో ఉన్నత న్యాయస్థానాల్లో మేవానీ సవాలు చేయనున్నాయని ఆనంద్ వివరించారు. 


అసోంలోని కోక్రఝర్‌‌లో జిగ్నేష్ మేవానీపై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనకు రెండు రోజుల ముందు ఏప్రిల్ 17న జిగ్నేష్ రెండు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లపై అసోంకు చెందిన అరుప్ కుమార్ డేయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రధాని నరేంద్ర మోడీ.. గాడ్సేని దేవుడిగా భావిస్తూ పూజిస్తున్నారని జిగ్నేష్ ట్వీట్ చేయడాన్ని అరుప్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గుజరాత్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ.. రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగిన ప్రాంతాలైన హిమ్మత్ నగర్, ఖంభత్, బెరావల్‌లలో శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు పిలుపునివ్వాలని జిగ్నేష్ మేవానీ డిమాండ్ చేయడాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ట్వీట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని, సమాజంలో ప్రజాశాంతికి విఘాతం కలుగుతోందని, పక్షపాతంతో చేసిన ఈ ట్వీట్లు కొన్ని వర్గాల్లో సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై బుధవారం అర్ధరాత్రి జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 11:30 గంల సమయంలో పాలన్‌పూర్ సర్క్యూట్ హౌస్ వ్ద జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేశామని అసోం పోలీసులు ట్వీట్ చేశారు. జిగ్నేష్ మేవానీ అరెస్ట్‌ను ఆయన మద్దతుదారులు కూడా ధృవీకరించారు.


Updated Date - 2022-04-22T19:37:21+05:30 IST