కువైత్‌లోని భారతీయులకు మరింత మెరుగైన సేవలు!

ABN , First Publish Date - 2022-02-28T14:52:56+05:30 IST

కువైత్‌లోని భారతీయులకు మరోమూడు పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. కువైత్ సిటీ, ఫహాహీల్, అబ్బాసియా ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి. బీఎల్ఎస్ ఇంటర్నే

కువైత్‌లోని భారతీయులకు మరింత మెరుగైన సేవలు!

ఎన్నారై డెస్క్: కువైత్‌లోని భారతీయులకు మరోమూడు పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. కువైత్ సిటీ, ఫహాహీల్, అబ్బాసియా ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సహకారంతో ఇండియన్ ఎంబసీ నెలకొల్పిన ఈ సెంటర్లను తాజాగా కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి ప్రారంభించారు. ఈ మూడు సెంటర్ల ద్వారా ఏటా సుమారు రెండు లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన అంచనా వేశారు. కువైత్‌లోని భారతీయులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. కాగా.. ఈ కేంద్రాలు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం ఫోటోకాపీ చేయడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫోటోగ్రఫీ, కొరియర్ డెలివరీ వంటి అదనపు సేవలను అందిస్తాయి. అంతేకాకుండా దరఖాస్తుదారులు ఈ కేంద్రాలలో వాణిజ్య, వ్యక్తిగత, విద్యార్హతల పత్రాల ధృవీకరణను కూడా పొందవచ్చు.




Updated Date - 2022-02-28T14:52:56+05:30 IST