నేపాల్ వరదల్లో ముగ్గురు భారతీయులు గల్లంతు

ABN , First Publish Date - 2021-06-18T05:25:17+05:30 IST

మన పొరుగుదేశం నేపాల్‌లో వరదలు విజృంభిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకూ 20 మంది గల్లంతయ్యారు.

నేపాల్ వరదల్లో ముగ్గురు భారతీయులు గల్లంతు

ఖాట్మండు: మన పొరుగుదేశం నేపాల్‌లో వరదలు విజృంభిస్తున్నాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకూ 20 మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లోనే వీళ్లు గల్లంతయ్యారు. దీనిపై సింధుపాల్‌చోక్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అరుణ్ పోఖ్రేల్ స్పందించారు. ‘‘మొత్తం ఆరుగురు విదేశీయులు.. ముగ్గురు భారతీయులు, ముగ్గురు చైనీయులు ఈ వరదల్లో గల్లంతయ్యారు. వీరంతా ఇక్కడ ఒక డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో పనిచేయడానికి వచ్చారు’’ అని అరుణ్ తెలిపారు. ఇక్కడి హిమానీ నదాలు ఉప్పొంగడం వల్లనే ఈ వరదలు సంభవించినట్లు భావిస్తున్నారు.

Updated Date - 2021-06-18T05:25:17+05:30 IST