గంటలో 3 లక్షల 40 వేల మొక్కలు

ABN , First Publish Date - 2021-07-25T06:09:35+05:30 IST

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారా వు జన్మదినం సందర్భంగా చేపట్టిన ముక్కోటి వృక్షా ర్చనలో భాగంగా శనివారం మోర్తాడ్‌ మండల కేం ద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మొక్కలు నా టారు.

గంటలో 3 లక్షల 40 వేల మొక్కలు
మోర్తాడ్‌లో మొక్కనాటుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో పెద్దఎత్తున నాటించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో అడవుల శాతం పెరిగిందని వెల్లడి

నిజామాబాద్‌, జూలైౖ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మోర్తాడ్‌: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారా వు జన్మదినం సందర్భంగా చేపట్టిన ముక్కోటి వృక్షా ర్చనలో భాగంగా శనివారం మోర్తాడ్‌ మండల కేం ద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మొక్కలు నా టారు. ముందుగా మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కేటీఆర్‌ జన్మదినాన్ని పు రస్కరించుకొని వేదపండితులు పూజలు నిర్వహించా రు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి భారీ కేక్‌ను చే శారు. ఈ సందర్భంగా మంత్రికి ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌, ఏలియా, ఇతర నాయకులు కేక్‌ను తినిపిం చారు. ఆ తర్వాత మండల పరిషత్‌ కార్యాలయం, ప ల్లె ప్రకృతి వనం వద్ద పెద్దఎత్తున మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అదే విధంగా బాల్కొండ నియోజకవర్గం పరిధిలో ఏకకాలంలో ఉద యం 10గంటల నుంచి 11గంటల మధ్య 3 లక్షల 40 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లు, అధికారులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆ ర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో అడవుల శాతం పెరిగిందని మంత్రి అన్నారు. దీంతో వర్షాలు సక్రమంగా పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో మరో 3శాతం అడవులను పెంచితే వర్షాలకు ఢోకా ఉండదని ఆయన అన్నారు. సమయానికి వర్షాలు  కురిస్తే ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్‌ దొరుకుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడితే రోగాలు కూడా త గ్గుతాయన్నారు. అయితే, మంత్రి కేటీఆర్‌ పుట్టిన రో జు సందర్భంగా మొక్కలు నాటాలని పిలుపునివ్వడం తో జిల్లా అంతటా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ సమర్థవంతమైన నాయకు డని మంత్రి కొనియాడారు. ఆయన జన్మదినాన ము క్కోటి మొక్కలు నాటేందుకు పిలుపునివ్వడం ఆయన సేవ నిరతికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో అ దనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, ఎంపీపీ శివలింగు శ్రీనివా స్‌, ఎంపీటీసీ బద్దం రవి, నాయకులు ఏలియా, తహ సీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:09:35+05:30 IST