జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు తీవ్రవాదుల అరెస్టు

ABN , First Publish Date - 2022-04-12T22:52:48+05:30 IST

ఉత్తర కశ్మీర్‌లో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న ముగ్గురు తీవ్రవాదుల్ని భద్రతాదళాలు సోమవారం అదుపులోకి తీసుకున్నాయి. ఇండియన్ ఆర్మీలోని చినార్ కార్ప్స్ విభాగానికి చెందిన దళాలు జరిపిన తనిఖీల సందర్భంగా లష్కరే తయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదుల్ని అరెస్టు చేశారు.

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు తీవ్రవాదుల అరెస్టు

ఉత్తర కశ్మీర్‌లో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్న ముగ్గురు తీవ్రవాదుల్ని భద్రతాదళాలు సోమవారం అదుపులోకి తీసుకున్నాయి. ఇండియన్ ఆర్మీలోని చినార్ కార్ప్స్ విభాగానికి చెందిన దళాలు జరిపిన తనిఖీల సందర్భంగా లష్కరే తయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరు కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని భద్రతా దళాలు చెప్పాయి. నిందితులు ఉన్న ప్రదేశం నుంచి పేలుడు పదార్థాలు ఉన్నసామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీనగర్ భద్రతా విభాగం ప్రకటించింది. 

Updated Date - 2022-04-12T22:52:48+05:30 IST