ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి.. వారి తలపై రూ. 30 లక్షల రివార్డు

Published: Mon, 20 Jun 2022 16:44:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి.. వారి తలపై రూ. 30 లక్షల రివార్డు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారి తలపై మొత్తంగా రూ. 30 లక్షల రివార్డు ఉన్నట్టు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. మృతి చెందిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు చెప్పారు. బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల్లోని హాక్ ఫోర్స్‌కు, రెబల్స్‌కు మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు మంత్రి పేర్కొన్నారు.  


మృతి చెందిన మావోలను డివిజనల్ కమిటీ సభ్యుడు నగేష్, కమాండర్లు మనోజ్, రామేగా గుర్తించారు. నగేష్ తలపై రూ. 15 లక్షల రివార్డు ఉండగా, మనోజ్, మహిళా కమాండర్ రామేలపై చెరో రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్టు మంత్రి నరోత్తమ్ తెలిపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.