ఎడగారు సాగుకు 3 వేల ఎకరాలు సిద్ధం

ABN , First Publish Date - 2021-05-11T03:45:12+05:30 IST

మండలంలో 3 వేల ఎకరాలను ఎడగారు సాగుకు సిద్ధం చేస్తున్నారు.

ఎడగారు సాగుకు 3 వేల ఎకరాలు సిద్ధం
ఎడగారు పంటసాగుకు సిద్ధం చేస్తున్న రైతు

పనులు ప్రారంభించిన రైతులు 

నాయుడుపేట, మే 10 : మండలంలో 3 వేల ఎకరాలను ఎడగారు సాగుకు సిద్ధం చేస్తున్నారు. సాగునీరు ఉండటంతో కొన్ని గ్రామాల్లో చెరువుల కింద కూడా ఎడగారు పంట సాగుచేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్‌లో వ్యవసాయశాఖ అధికారులు సూచించిన నెల్లూరు జిలకర, నెల్లూరు మసూర (ఎన్‌ఎల్‌ఆర్‌ 34449) రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు.  నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ఉండటంతో మోటారు పంపుల కింద పూర్తి స్థాయిలో పొలాలను సిద్ధం చేస్తున్నారు

Updated Date - 2021-05-11T03:45:12+05:30 IST