30 రోజుల్లో లెక్కలు సమర్పించండి

ABN , First Publish Date - 2022-02-26T14:53:03+05:30 IST

ఇటీవల జరిగిన నగర, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా 30 రోజుల్లో తమ ఎన్నికల ప్రచార లెక్కలను చూపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయంపై

30 రోజుల్లో లెక్కలు సమర్పించండి

                  - రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం


అడయార్‌(చెన్నై): ఇటీవల జరిగిన నగర, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా 30 రోజుల్లో తమ ఎన్నికల ప్రచార లెక్కలను చూపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయంపై ఎన్నికల సంఘం శుక్రవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 489 పట్టణ పంచాయతీలకు ఎన్నికల పోలింగ్‌ జరుగగా, 22వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించడం జరిగింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తేదీ నుంచి 30 రోజుల్లో తమ ప్రచార ఖర్చుల లెక్కలను సమర్పించాలని ఇప్పటికే ఆదేశించడం జరిగింది. కార్పొరేషన్‌ కౌన్సిలర్‌ పదవులకు పోటీ చేసిన అభ్యర్థులు జిల్లా ఎన్నికల అధికారికి, మున్సిపాలిటీ వార్డు మెంబర్లకు పోటీ చేసిన అభ్యర్థులు మున్సిపాలిటీ కమిషర్‌కు, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు టౌన్‌ పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌కు సమర్పించాలని పేర్కొంది. అదేవిధంగా ఏకగ్రీంగా ఎన్నికైన అభ్యర్థులు కూడా ఈ లెక్కలను సమర్పించాలని కోరింది. నిర్ణీత గడువులోగా ఈ లెక్కలను సమర్పించని అభ్యర్థులను మూడేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. 

Updated Date - 2022-02-26T14:53:03+05:30 IST