30 Years Prudhvi: వైసీపీలో ఉంది పృథ్వీ కాదు.. ఒక ఉగ్రవాది (OHRK Promo)

Published: Fri, 24 Jun 2022 20:41:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
30 Years Prudhvi: వైసీపీలో ఉంది పృథ్వీ కాదు.. ఒక ఉగ్రవాది (OHRK Promo)

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ (30 Years Industry Prudhvi).. పరిచయం అక్కరలేని పేరు. కమెడియన్‌గా అందరినీ మెప్పించిన పృథ్వీరాజ్.. ఆ తర్వాత రాజకీయ బాట పట్టి అనేకానేక ఆరోపణలు ఎదుర్కొని.. మళ్లీ సినిమా ఇండస్ట్రీ గూటికి చేరి.. ప్రస్తుతం తన వద్దకి వచ్చిన పాత్రలు చేసుకుంటున్నారు. 2024లో మంచి పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్న పృథ్వీ.. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన.. తన సినీ జీవితానికి, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాజాగా Open Heart with RK కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో పృథ్వీ చెప్పిన విషయాలివే.. 

* ‘‘ఏయ్.. థర్టీ ఇయర్స్ అని అంతా అరుస్తుంటే.. బాబూ ఇది శ్రీవారి సన్నిధానం.. ఇక్కడ గోవిందా.. తప్ప మరో మాట అనకూడదు అని చెప్పేవాడిని.

* ‘గండికోట రహస్యం’ చిత్రానికి రామారావుగారి గెటప్ వేయాలని అన్నారు. బాగా ప్యాడింగ్ అది పెట్టారు. ఆ పాత్ర చేశాక.. నా జీవితానికి అదే అండమాన్ జైలు అవుతుందని అనుకోలేదు.

* ఆ పాత్ర వేసే సమయంలో నాకు ప్రపంచం మరో రకంగా కనిపించింది. వెళ్లిపోయి అన్నగారి కాళ్లమీద పడి.. అసలు విషయం చెప్పాను. ‘ఏం బ్రదర్.. ఎప్పుడు అలాంటివి చేయకండి మీరు’ అని అన్నారు. 

* పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లుగా.. ఒకతను నా మైండ్‌ను పొల్యూట్ చేసి వైసీపీ వైపు నడిపించాడు. 

* అక్కడికి వెళ్లాక అహంకారం, కొవ్వు, మదం.. వంటి వాటితో నేనే టాప్ అన్నట్లుగా ఏది పడితే అది మాట్లాడేశాను. అక్కడుంది అప్పుడు పృథ్వీ కాదు.. ఒక ఉగ్రవాది. ఒక మూర్ఖుడిగా ఉండిపోయా. 

* చంద్రబాబు (Chandrababu) గారెక్కడ.. నేనెక్కడ?

* చిరంజీవి (Chiranjeevi)గారిని, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గారిని తిట్టిన విషయంలో.. స్వయంగా వెళ్లి మీ కాళ్లకు దండం పెడతానని చెప్పా. వాళ్లందరూ చాలా హార్ట్‌ఫుల్‌గా తీసుకుని.. ఆ విషయాన్ని వదిలేశారు. లేదంటే పృథ్వీరాజ్ వెళ్లిపోయి మూడేళ్లు అయ్యేది.

* జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) దగ్గర అభిమానం సంపాదించవచ్చు.. తర్వాత ఇక ఎమ్.పి పదవే అన్నట్లుగా కొందరు, తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ నీవేనయా అని మరికొందరు.. ఇలా అంతా మాట్లాడేసరికి ఏం మాట్లాడేది కూడా తెలియలేదు. ఈ సందర్భంగా ఏబీఎన్ ద్వారా అమరావతి రైతులందరూ నన్ను క్షమించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

* ఆ పిరియడ్‌లో పృథ్వీ ఒక అపరిచితుడు. ఇంకో పాత్రలో ఉండిపోయా. 

* జగన్‌ని కలిశాక.. అంత చదివి.. అహం చంపుకుని.. నీ బాంచన్ దొర.. కాల్ మొక్తా అని బతకాల్సిన అవసరం ఏమోచ్చింది అని తర్వాత అనిపించింది.

* 9 నెలల ప్రసవ వేదన తర్వాత బిడ్డ పుడతాడు.. కానీ నా విషయంలో మాత్రం 3వ నెలలోనే అబార్షన్ చేసి పంపించారు. 

* ఆ ఆడియో వల్లే.. అనుకుంటే నేను నా వైఫ్‌కి సమాధానం చెప్పుకోవాలి. నా విషయంలో అలా చేశారు. ప్రస్తుతం ఓ మంత్రిగారు ‘సుగుణ..’ అంటూ చేస్తే మాత్రం ఏం చేయకుండా వదిలేశారు. 

* పుట్టుకతోనే చిప్ లేని వాళ్లు కొందరు ఉంటారు.. చిప్ పెట్టిన తర్వాత కూడా దానిని ఆపేసుకున్నవాడిని దరిద్రుడు, వెర్రిపప్ప అంటారు. 

* కాపులంటే వివక్ష ఏమైనా ఉందేమో అని అనిపించింది. దానిలో నేను బలైపోయానేమో అని అనిపించింది. మా ఇంటి పేరు బలిరెడ్డి. పృథ్వీరాజ్‌కి ముందుకాకుండా దానిని తర్వాత వాడి ఉంటే.. లాస్ట్‌లో రెడ్డి అని ఉండేది. అలా ఉండి ఉంటే నేనిప్పుడు ఎక్కడికి కదిలేవాడిని కాదేమో.  

* 2024లో ఒక మంచి బస్సు ఎక్కి.. ఆ బస్సుకి సపోర్ట్ చేయాలి. జనసేన వైపు వెళితే.. బాబుగారితో పాటు ఉండవచ్చు. 

* చివరిగా నేను నేర్చుకున్నది ఏమిటంటే.. టంగ్‌తో జాగ్రత్తగా ఉండాలి..’’ లాంటివే కాకుండా.. జగన్ మూడేళ్ల పరిపాలనపై అభిప్రాయం, ఇంకా సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి ఎన్నో  విషయాలను పృథ్వీ ఈ ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నారు. అవన్నీ తెలియాలంటే ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘Open Heart with RK’ కార్యక్రమం చూడాల్సిందే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International