
కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో మరణిస్తున్న పౌరుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఉక్రెయిన్ హ్యూహాత్మక తీర ప్రాంత నగరమైన మరియుపోల్‌పై రష్యా వాయుమార్గంలో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో మరియుపోల్‌లోని ఒక డ్రామా థియేటర్ నేలమట్టం కాగా, అందులో ఆశ్రయం పొందుతున్న సుమారు 300 మంది పౌరుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ప్రత్యక్ష సాక్షుల కథనం. దీనిని మరియుపోల్ సిటీ హాల్ అధికారులు టెలిగ్రామ్‌లో ధ్రువీకరించింది.
ఇవి కూడా చదవండి
క్లినిక్‌పై బాంబింగ్..నలుగురు మృతి
కాగా, ఖర్గివ్ నగరంలోని హ్యుమనటేరియన్ ఎయిడ్ కేంద్రాన్ని రష్యా రాకెట్ లాంచెర్లు శుక్రవారం ఉదయం తాకడంతో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు ప్రాంతీయ పోలీసులు సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
నాటో నేతల సమావేశం
మరోవైపు, బ్రసెల్స్‌లో నాటో నేతలు సమవేశమయ్యారు. కెమికల్, బయోలాజికల్, న్యూక్లియర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు వీలుగా ఉక్రెయిన్‌కు సహకరించాలని నాటో నేతలు నిర్ణయించినట్టు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. యాంటీ షిప్ మిసైల్స్‌ను ఉక్రెయిన్‌కు ఇచ్చి సహకరించాలని కూటమి భాగస్వాములు నిర్ణయించినట్టు చెప్పారు.