టైమ్స్ స్క్వేర్ వద్ద 3వేల మంది యోగాసనాలు

ABN , First Publish Date - 2021-06-21T17:09:08+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా న్యూయార్క్‌గల టైమ్స్ స్క్వేర్ వద్ద దాదాపు 3000వేల మంది ప్రజలు ఆసనాలు వేశారు. ‘సోల్ట్సైస్ ఫర్ టైమ్స్ స్క్వేర్ 2021’ థీమ్‌తో కాన్సులేట్ జనరల్ ఆఫ్

టైమ్స్ స్క్వేర్ వద్ద 3వేల మంది యోగాసనాలు

వాషింగ్టన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా న్యూయార్క్‌గల టైమ్స్ స్క్వేర్ వద్ద దాదాపు 3000వేల మంది ప్రజలు ఆసనాలు వేశారు. ‘సోల్ట్సైస్ ఫర్ టైమ్స్ స్క్వేర్ 2021’ థీమ్‌తో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టైమ్స్ స్క్వేర్ ప్రతినిధులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో పుట్టిన యోగా ప్రస్తుతం ప్రపంచ వారసత్వ సంపదగా మారింది. ప్రశాంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగాను ప్రాక్టీస్ చేయాలి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా టైమ్స్ స్క్వేర్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా యోగా‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-06-21T17:09:08+05:30 IST