Work Visa: కువైత్‌లో ప్రవాసులకు 30వేల కొత్త వర్క్ వీసాలు.. 10లక్షల వీసాల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-08-31T14:30:36+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ గతకొంతకాలంగా వలసదారులకు జారీ చేసే వర్క్ వీసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

Work Visa: కువైత్‌లో ప్రవాసులకు 30వేల కొత్త వర్క్ వీసాలు.. 10లక్షల వీసాల పునరుద్ధరణ

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గతకొంతకాలంగా వలసదారులకు జారీ చేసే వర్క్ వీసాల (Work visa) విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంతకుముందులా భారీ సంఖ్యలో వర్క్ వీసాలు ఇవ్వడం లేదు. వర్క్ పర్మిట్ల (Workpermits) విషయంలో ఎన్నో షరతులు విధిస్తోంది. ఇదిలాఉంటే..  గడిచిన ఏడాది కాలంగా ప్రవాసులకు జారీ చేసిన వర్క్ వీసాల వివరాలను తాజాగా పబ్లిక్ అథారిటీ మ్యాన్‌పవర్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ సీస్టం సెంటర్ ఆపరేషన్స్ చీఫ్ బష్రా సెలీం వెల్లడించారు. వర్క్ వీసాల జారీ కోసం తీసుకొచ్చిన కొత్త మెకానిజం ఆషల్ (Ashal) ద్వారా కొత్తగా 30వేల వర్క్ పర్మిట్లను (Workpermits) జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే 1.27 మిలియన్ల వర్క్ వీసాలను పునరుద్ధరించినట్లు తెలిపారు. కొత్త మెకానిజాన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్‌తో లింక్ చేయడం ద్వారా వర్క్ వీసాల జారీ మరింత సులభతరంగా మారిందని బష్రా చెప్పారు. అటు దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక ఆటోమెటిక్ విధానాన్ని అభివృద్ధి చేసినట్లు సంబంధిత అధికారి అల్ ముతైరీ వెల్లడించారు. 

Updated Date - 2022-08-31T14:30:36+05:30 IST