ఉపకార వేతనాల దరఖాస్తులకు 31 గడువు

ABN , First Publish Date - 2022-07-02T07:00:58+05:30 IST

విదేశీ విద్యాపథకం కింద ఉపకార వేతనాల కోసం గాను తెలంగాణ మైనారిటీ విద్యార్థులు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నిర్మల్‌లోని ఇందిరానగర్‌ కార్యా లయంలో హార్డ్‌కాపీ అందజేయాలని ఆ శాఖ జిల్లా అధికారిణి బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు.

ఉపకార వేతనాల దరఖాస్తులకు 31 గడువు

నిర్మల్‌ కల్చరల్‌, జూలై 1 : ముఖ్యమంత్రి విదేశీ విద్యాపథకం కింద ఉపకార వేతనాల కోసం గాను తెలంగాణ మైనారిటీ విద్యార్థులు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని నిర్మల్‌లోని ఇందిరానగర్‌ కార్యా లయంలో హార్డ్‌కాపీ అందజేయాలని ఆ శాఖ జిల్లా అధికారిణి బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.20 లక్షలతో పాటు 60 వేల విమాన రవాణాచార్జీలు మంజూరవుతాయన్నారు. ఇంజనీరింగ్‌, డిగ్రీలో 60 శాతం మార్కులతో పాటు పీజీ, పీహెచ్‌డీ చేయాలనుకునే వారు 60 శాతం మార్కులు పొందినవారు అర్హులన్నారు. అయితే జనవరి 2022 నుంచి జూలై లోగా విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం పొంది ఉండాల న్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం వెబ్‌సైట్‌లోనూ అందుబాటు లో ఉన్నట్లు వివరించారు. 


Updated Date - 2022-07-02T07:00:58+05:30 IST