31న రామచంద్రపురంలో జాబ్‌మేళా

Published: Sun, 27 Mar 2022 01:20:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కపిలేశ్వరపురం, మార్చి 26: రామచంద్రపురం ఆర్డీవో కార్యాలయంలో డీడీయూ-జీకేవై సిడాప్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల31న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బీకేఎస్‌ఎస్‌ వెంకట్‌రామన్‌ తెలిపారు.  బైజూస్‌ కంపెనీలో బిజినెస్‌ డెవలప్మెంట్‌ ట్రైని పోస్టుకు ఏదైనా డిగ్రీ కలిగి 19-30ఏళ్ల స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు. వాత్సల్య(చిల్డ్రన్‌ మల్టీస్పెషాలిటీ హాస్పటల్‌)లో స్టాఫ్‌నర్సు, ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్‌, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం అనుభవం గల 19-30ఏళ్ల  స్త్రీ, పురుష అభ్యర్థులు, అమరరాజా బ్యాటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఆపరేటర్స్‌ పోస్టుకు పదోతరగతి, ఇంటర్‌, ఐటీఐ చదివిన 19-30 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులన్నారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్‌ పోస్టుకు ఎం.ఫార్మసీ, డీఫార్మసీ, బీఫార్మసీతోపాటు పీసీఐ సర్టిఫికెట్‌ కలిగిన 19-30ఏళ్ల స్త్రీ, పురుష అభ్యర్థులు, ఫార్మా అసిస్టెంట్‌ పోస్టుకు పదో తరగతి, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ చదివిన 19-30ఏళ్ల పురుష అభ్యర్థులు, ఆడిటర్స్‌ పోస్టుకు బీకాం కంప్యూటర్స్‌ చదివిన 19-30ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులన్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.