32 ఏళ్ల క్రితం దోపిడీ కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-12-10T17:22:15+05:30 IST

బళ్లారి తాలూకా పరమదేవనహళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో 32 ఏళ్ల క్రితం అంటే 1989లో జరిగిన ఓ దోపిడీ ఘటనకు సంబంధించిన కేసులో నలుగురు నిందితును పీడీ హళ్లి పోలీసులు అరెస్టు చేసినట్లు బళ్లారి జిల్లా

32 ఏళ్ల క్రితం దోపిడీ కేసులో నిందితుల అరెస్టు

బళ్లారి(కర్ణాటక): బళ్లారి తాలూకా పరమదేవనహళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో 32 ఏళ్ల క్రితం అంటే 1989లో జరిగిన ఓ దోపిడీ ఘటనకు సంబంధించిన కేసులో నలుగురు నిందితును పీడీ హళ్లి పోలీసులు అరెస్టు చేసినట్లు బళ్లారి జిల్లా ఎస్పీ సైదుల్లా అదావత్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చేళ్లగురికి  గ్రామానికి చెందిన దొడ్డనగౌడ, శ్రీమతికి చెందిన రెండు ఇళ్లలో 20 నుంచి 30 మంది ముసుగుదొంగలు చొరబడి బెదిరించి తలుపులు విరగొట్టి రూ 1,00,540 విలువ చేసే  బంగారు, ఆభరణాలు, మరో ఇంటిలో రూ 30,900 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు దొచుకుని వెళ్లారు. ఈ మేరకు అప్పట్లో 149/1089, 150/1989 అండర్‌ సెక్షన్‌ 395ఐపిసి కింద ఆరుగురిని అరెస్టు చేశారు. 1995లో జరిగిన కోర్టు విచారణలో 1 నుంచి 6వ ముద్దాయి వరకు నిర్దోషులుగా విడుదల అయ్యారు. మిగిలిన 19 మంది దొంగల ఆచూకి దొరకనందున కేసు లాంగ్‌ పెండిగ్‌ ట్రయిల్‌గా క్లోజ్‌ చేశారు. అయితే ఈ కేసులో మిగిలిన నిందితులు అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బళ్లారి గ్రామీణ ఉప విభాగం డీవైఎస్పీ నేతృత్వంలో  మోకా పీఎ్‌సఐ రఘు.ఎన్‌, పీడీ హళ్లి పీఎస్ఐ శశిధర్‌వై, ప్రొబెషనరీ పీఎస్ఐ మణికంఠ కెహెచ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ధారసింగ్‌, విజయ హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ భాస్కయ హెడ్‌ కానిస్టేబుల్‌ మంజురనాథ్‌, కానిస్టేబుల్‌ పక్కీరప్ప బృందంగా ఏర్పడి కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అప్పట్లో కేసులో నిందితులుగా ఉన్న 19మందిలో 12 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఏడుగురు నిందితుల్లో దర్యాప్తు బృందం నలుగురిని అరెస్టు చేసింది. పోలీసులు అరెస్టు చేసిన వారిలో  మద్దిగేరి గ్రామానికి చెందిన భానుకోట వెంకటేష్‌, తుగ్గలి గ్రామానికి చెందిన చంద్రగాడు, మద్దికేరి గ్రామానికి చెందిన కావేటి వెంకటేష్‌, మద్దిగేరి గ్రామానికి చెందిన దుర్గాడు అను నలుగురు నిందితులుగా ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 32 ఏళ్ల క్రితం జరిగిన దోపిడీ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న నలుగురు నిందితులను అరెస్టు చేయడంలో విజయం సాధించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ సైదుల్లా అదావత్‌ అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-12-10T17:22:15+05:30 IST