ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్: అమిత్ షా

ABN , First Publish Date - 2022-03-08T21:41:07+05:30 IST

తాను మళ్లీ త్రిపురకు వస్తానని చెప్పిన అమిత్ షా.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను విప్లవ్ దేవ్‌ ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. తాను మళ్లీ త్రిపురకు వస్తానని, ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి..

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్: అమిత్ షా

లఖ్‌నవూ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని అగర్తలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చేసిన అభివృద్ధిని, మున్ముందు చేయబోయే పనుల గురించి ప్రస్తావించారు.


‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రపంచంతో త్రిపురకు మరింత అనుసంధానం పెరిగింది. రాష్ట్రంలో రైల్వే లైన్లు పెరిగాయి. నాలుగేళ్లలో 542 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించాము. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో నేరాలు 30 శాతం తగ్గాయి’’ అని అమిత్ షా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపైందరని అన్నారు. ప్రస్తుతం రైతుల ఆదాయం 1.3 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ఇక ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ యంత్రాగాల్లోని ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నట్లు ప్రకటించారు.


తాను మళ్లీ త్రిపురకు వస్తానని చెప్పిన అమిత్ షా.. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను విప్లవ్ దేవ్‌ ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. తాను మళ్లీ త్రిపురకు వస్తానని, ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.

Updated Date - 2022-03-08T21:41:07+05:30 IST