35 లక్షల చెరకు విత్తనం సరఫరా

ABN , First Publish Date - 2021-05-11T04:28:30+05:30 IST

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ సభ్య రైతులకు ఈ సీజన్‌లో 35 లక్షల ఒంటి కన్ను ముచ్చు విత్తనాలు సరఫరా చేస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు.

35 లక్షల చెరకు విత్తనం సరఫరా
గోవాడ ఎండీ సన్యాసినాయుడు

గోవాడ షుగర్స్‌ ఎండీ సన్యాసినాయుడు

చోడవరం, మే 10:
గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ సభ్య రైతులకు ఈ సీజన్‌లో 35 లక్షల ఒంటి కన్ను ముచ్చు విత్తనాలు సరఫరా చేస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు. గత ఏడాది 33 లక్షల టన్నుల చెరకు విత్తనం సరఫరా చేశామన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే తొమ్మిది లక్షల టన్నుల విత్తనం సరఫరా చేసినట్టు చెప్పారు. మిగిలిన విత్తనం త్వరగా పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అలాగే ఎరువుల పంపిణీకి టెండరు సిద్ధం చేశామని, జాయింట్‌ కలెక్టర్‌ సెలవులో ఉన్నందున టెండరు తాత్కాలికంగా వాయిదా పడిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది నాలుగు వేల టన్నుల యూరియాతో పాటు వెయ్యి టన్నుల ఎంవోపీ, వెయ్యి టన్నుల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ పంపిణీ చేస్తామన్నారు.


15 రోజుల్లో రైతులకు చివరి విడత చెల్లింపులు
ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన సభ్య రైతులకు రూ.47 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఎండీ తెలిపారు. ప్రస్తుతం పంచదార విక్రయాలపై దృష్టిసారించామని, ఈ ప్రక్రియను పూర్తిచేసి 15 రోజుల్లోగా రైతుల బకాయిలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.

Updated Date - 2021-05-11T04:28:30+05:30 IST