బడ్జెట్‌లో 35 కొత్త స్కీమ్‌లు: మంత్రి హరీష్‌రావు

Published: Mon, 07 Mar 2022 16:42:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బడ్జెట్‌లో 35 కొత్త స్కీమ్‌లు: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో 35 కొత్త స్కీమ్‌లు పెట్టామని ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం స్కీమ్ కంటిన్యూ అవుతోందన్నారు. 3 లక్షల స్కీమ్‌కి, డబుల్ బెడ్ రూం స్కీమ్‌కి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 15 వందల మందికి దళితబంధును అందిస్తామన్నారు. ఈ ఏడాది 45 వేల మందికి దళితబంధు ఇస్తామన్నారు. వచ్చే బడ్జెట్ నాటికి 2 లక్షల మందికి దళితబంధును అందిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.