ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై 350 పేజీల రిపోర్ట్‌

ABN , First Publish Date - 2020-07-06T21:57:23+05:30 IST

350 పేజీల రిపోర్ట్‌ను సీఎం జగన్‌కు అందించామని హైపవర్‌ కమిటీ చైర్మన్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో 12మంది మృతిచెందారని

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై 350 పేజీల రిపోర్ట్‌

అమరావతి: 350 పేజీల రిపోర్ట్‌ను సీఎం జగన్‌కు అందించామని హైపవర్‌ కమిటీ చైర్మన్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో 12మంది మృతిచెందారని, 585మంది అస్వస్థతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ప్రజల నుంచి 1250 ప్రశ్నలు, 250 ఈమెయిల్‌లు, 180 ఫోన్‌కాల్స్‌, మెస్సేజ్‌లు వచ్చాయని ఆయన చెప్పారు. ట్యాంక్‌లో టెంపరేచర్‌ పెరగడంతో ప్రెజర్‌ ఏర్పడి గ్యాస్‌ లీకైందని, ట్యాంక్‌ డిజైన్‌, కూలింగ్‌ సిస్టమ్‌ సరిగా లేకపోవడం... సిబ్బందికి అవగాహన లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌లో పైపింగ్‌లో మార్పులు చేశారని, పైపింగ్‌లో మార్పులతో సిస్టమ్‌ డిస్టర్బ్‌ అయిందన్నారు. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు సైరన్‌లు మోగలేదని తెలిపారు. నియంత్రణ వ్యవస్థలో కొన్ని లోపాలు గుర్తించామని, ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డు ఏర్పాటుకు సూచించామని నీరబ్‌కుమార్ చెప్పారు.


అంతకుముందు జగన్‌తో హైపవర్ కమిటీ భేటీ అయింది. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా... తీసుకోవాల్సిన జాగ్రత్తలను నివేదికలో కమిటీ పేర్కొంది. రెండు నెలలపాటు పరిస్థితులను కమిటీ అధ్యయనం చేసింది. ఎల్జీ పాలిమర్స్ నుంచి అనేక వివరాలను కమిటీ అడిగి తెలుసుకుంది.







Updated Date - 2020-07-06T21:57:23+05:30 IST