లోక్‌ అదాలత్‌లో 3,564 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-08-14T05:43:24+05:30 IST

లోక్‌అదాలత్‌ ద్వారా జిల్లాలో 3,564 కేసులు పరిష్కారం అయ్యాయి.

లోక్‌ అదాలత్‌లో 3,564 కేసుల పరిష్కారం
సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి ప్రేమావతి

- జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి

మహబూబ్‌నగర్‌ లీగల్‌ కంట్రిబ్యూటర్‌, ఆగస్టు 13 : లోక్‌అదాలత్‌ ద్వారా జిల్లాలో 3,564 కేసులు పరిష్కారం అయ్యాయి. జాతీయ న్యాయాధికారసేవా సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ అధికార సేవాసంస్థ ఆధ్వర్యంలో శనివా రం లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం మహబూబ్‌ నగర్‌ జిల్లా కోర్టులో ఆరు, జడ్చర్ల కోర్టులో రెండు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం మంచి మార్గమని, ఈ అవకాశాన్ని జిల్లాలోని కక్షిదారులు చక్కగా వినియోగించుకున్నారని తెలిపారు. రాజీ అయ్యే అన్ని రకాల కేసులను పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు, రెండవ అదనపు జిల్లా ఇన్‌చార్జి న్యాయమూర్తి పద్మ, జిల్లా న్యాయసేవాసంస్థ కార్యదర్శి సంధ్యారాణి, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి కిరణ్‌,పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:43:24+05:30 IST