నా పదవీ కాలంలో అదే అత్యంత దారుణమైన ప్రదర్శన: రవిశాస్త్రి

Dec 7 2021 @ 21:00PM

న్యూఢిల్లీ: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌బాల్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలడం హెడ్ కోచ్‌గా తన పదవీకాలంలో అత్యంత దారుణమైన ప్రదర్శన మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అత్యల్ప స్కోరు నమోదైన ఆ ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయారు.


ఈ మ్యాచ్ తర్వాత కొన్ని రోజులపాటు తాము షాక్‌లో ఉండిపోయామని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా మూడో రోజు అత్యల్ప స్కోరు చేసిందని, అనంతరం 8 వికెట్ల తేడాతో పరాజయం పాలవడం హెడ్ కోచ్‌గా తన పదవీ కాలంలో మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.