పరీక్షల రద్దుకు 36 గంటల డెడ్‌లైన్‌

ABN , First Publish Date - 2021-06-24T09:12:38+05:30 IST

‘‘రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల రద్దు చేయాల్సిందే. దీనికిగాను ఈ ప్రభుత్వానికి 36 గంటల సమయం ఇస్తున్నాం

పరీక్షల రద్దుకు 36 గంటల డెడ్‌లైన్‌

స్పందించకుంటే పోరాటం తీవ్రం:లోకేశ్‌


అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షల రద్దు చేయాల్సిందే. దీనికిగాను ఈ ప్రభుత్వానికి 36 గంటల సమయం ఇస్తున్నాం. ఇదే డెడ్‌లైన్‌. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పోరాటాన్ని తీవ్రం చేస్తాం. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం’’ అని మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షల విషయంలో ప్రత్యక్షంగా 15 లక్షల మంది విద్యార్థుల మానసిక క్షోభకు గురికావడానికి కారణమైన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని ‘మెంటల్‌ మామ’ అనడంలో తప్పేముందని విమర్శించారు. పరీక్షలు నిర్వహిస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా 80 లక్షల మందిపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. కరోనా మూడో దశ కూడా రానుందనే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాల్సిన ప్రభుత్వం.. మూర్ఖంగా ముందుకెళ్తోందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ.. కరోనా పరిస్థితిని గమనించి సీబీఎ్‌సఈ పరీక్షలు రద్దు చేశారని, దాదాపు అన్ని రాష్ట్రాలు బోర్డు పరీక్షలను రద్దుచేశాయని లోకేశ్‌ తెలిపారు. మూర్ఖత్వాన్ని వీడి జగన్‌ ప్రభుత్వం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.   

Updated Date - 2021-06-24T09:12:38+05:30 IST