36 మందికి హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

ABN , First Publish Date - 2021-10-27T05:13:17+05:30 IST

ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు ఎట్టకేలకు మంగళవారం ప్రా రంభమయ్యాయి. జిల్లాలోని జడ్పీ హైస్కూళ్లల్లో ఖాళీగా ఉన్న 40 గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేసేం దుకు ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో ని డీసీబీఈ కార్యాలయంలో డీఈఓ బి.విజయ భాస్కర్‌ ప్రమోషన్ల కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

36 మందికి హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

ఒంగోలు విద్య, అక్టోబరు 26: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు ఎట్టకేలకు మంగళవారం ప్రా రంభమయ్యాయి. జిల్లాలోని జడ్పీ హైస్కూళ్లల్లో ఖాళీగా ఉన్న 40 గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేసేం దుకు ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో ని డీసీబీఈ కార్యాలయంలో డీఈఓ బి.విజయ భాస్కర్‌ ప్రమోషన్ల కౌన్సిలింగ్‌ నిర్వహించారు. హెచ్‌ఎంల సీనియారిటీ జాబితాలను స్కూలు అసిస్టెంట్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల సేవా పుస్తకాలు, వి ద్యార్హతల సర్టిఫికెట్లను ఉదయం పరిశీలించి మధ్యాహ్నం ప్రయోషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిం చారు. మొదట 40మందిని పిలవగా 36మంది మాత్రమే స్థానాలు కోరుకున్నారు. వారిలో 23మ ంది ఎస్‌ఏలు కాగా 13మంది పీడీలు ఉన్నారు.. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతి (అడ్‌హాక్‌)పై ఈ ఉద్యోగోన్నతులు ఇచ్చారు.   కాగా ఉద్యోగోన్నతులకు సంబంధించిన సీనియా రిటీ జాబితాలో తప్పులతో అన్యాయం జరుగు తుందని ఒక మహిళా టీచర్‌ పాఠశాల విద్య క మిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి న ఆయన వెంటనే జాబితాను పునఃపరిశీలించి తప్పులు ఉంటే సరిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పునఃపరిశీలనలో జాబితా కరెక్టుగా ఉన్నట్లు తేలడంతో దాని ప్రకారమే కౌన్సెలింగ్‌ నిర్వహించారు.


Updated Date - 2021-10-27T05:13:17+05:30 IST