
అడయార్(చెన్నై): దాదాపు 36 యేళ్ళ తర్వాత ఊటీ మున్సిపాలిటీ చైర్మన్ పదవి డీఎంకే వశంకానుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఊటీలో డీఎంకే 20స్థానాలు కైవసం చేసుకుంది. గత 1986లో జరిగిన స్థానిక ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించగా, మున్సిపాలిటీ చైర్మన్గా సుందర్రాజ్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూటమి పార్టీగా ఉన్న తమిళ మానిల కాంగ్రెస్కు ఛైర్మన్ పదవిని అప్పగించింది. 2001లో జరిగిన ఎన్నికల్లో కూడా డీఎంకే కూటమి అధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ చైర్మన్ పదవిని కాంగ్రెస్కు ఇచ్చారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం ఉన్న 36 సీట్లలో డీఎంకే 20 సీట్లను గెలుచుకుంది. దీంతో డీఎంకేకు చైర్మన్ పదవి దక్కనుంది. ఈ కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి ఆరు స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో 36 యేళ్ళ తర్వాత ఊటీ మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీని డీఎంకే సొంతం చేసుకోనుంది.
ఇవి కూడా చదవండి