మేడ్చల్‌ జిల్లాలో కొత్తగా 3,781మందికి రైతుబంధు

ABN , First Publish Date - 2022-06-28T05:48:36+05:30 IST

మేడ్చల్‌ జిల్లాలో కొత్తగా 3,781మందికి రైతుబంధు

మేడ్చల్‌ జిల్లాలో కొత్తగా 3,781మందికి రైతుబంధు

  • వానాకాలంలో మొత్తం 44,792 మంది రైతులకు రైతుబంధు సాయం

మేడ్చల్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లాలో కొత్త రైతులకూ రైతుబంధు అందించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త పాసుపుస్తకాలు వచ్చిన చాలా మందికి రైతుబంధు అందలేదు. ఈ వానకాలం నుంచి కొత్తగా ధరణి పాసుపుస్తకాలు తీసుకున్న వారికి రైతుబంధు ఇ వ్వాలని ప్రభుత్వం అదేశించింది. జూలై 5 వరకు దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో కొత్తగా రైతుబంధు కోసం 3,781మంది రై తులు దరఖాస్తు చేసుకున్నారని వ్యవసాయ అధికారి రేఖ తెలిపారు. వీరందరికి రైతుబంధు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో రైతుబంధు ద్వారా 44,792 మంది రైతులకు కింద డబ్బులు రానున్నాయి. రూ.39,74,06.002 రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. అల్వాల్‌ మండలంలో 316మంది రైతులకు, బాచుపల్లిలో 66 మందికి, దుండిగల్‌ 3641 మందికి, కూకట్‌పల్లిలో 12మంది రైతులకు, కుత్బుల్లాపూర్‌లో 180 మంది రైతులకు, ఉప్పల్‌లో 235 మందికి, ఘట్‌కేసర్‌లో 6,748 మందికి, కాప్రాలో 130 మందికి, కీసరలో 7,193 మంది రైతులకు, మేడ్చల్‌లో 10,914మంది రైతులకు, మేడిపల్లిలో 368 మందికి, మూడుచింతలపల్లిలో 7,059మందికి, శామీర్‌పేటలో 7,930మంది చొప్పున రైతులకు రైతుబంధు రానుంది.

Updated Date - 2022-06-28T05:48:36+05:30 IST