21 రోజులు 38 మంది మృతులు

ABN , First Publish Date - 2021-04-22T06:17:23+05:30 IST

జిల్లాలో కరోనా మృత్యుఘోష వినిపిస్తోంది. రెండో దశ వైరస్‌ జిల్లా ప్రజలను భయపెడుతోంది. నిత్యం ఏదో ఒక చోట చావు విషాదం చోటు చేసు కుంటోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా పాజి టివ్‌ కేసులు ట్రిఫుల్‌ సెంచరీ దాటుతున్న క్రమంలో మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

21 రోజులు 38 మంది మృతులు

- జిల్లాలో కరోనా ఉధృతి 

- తాజాగా ఇద్దరు మృతి

- 371 మందికి పాజిటివ్‌

- యాక్టివ్‌ కేసులు  4,228 

- పాజిటివ్‌ వ్యక్తులపై పర్యవేక్షణ కరువు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

జిల్లాలో కరోనా మృత్యుఘోష వినిపిస్తోంది. రెండో దశ వైరస్‌ జిల్లా ప్రజలను భయపెడుతోంది.  నిత్యం ఏదో ఒక చోట చావు విషాదం చోటు చేసు కుంటోంది.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా పాజి టివ్‌ కేసులు ట్రిఫుల్‌ సెంచరీ దాటుతున్న క్రమంలో మరణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బుధ వారం జిల్లాలో తాజాగా 371 మంది పాజిటివ్‌ బారి న పడ్డారు. ఇద్దరు మృత్యువాత పడ్డారు. సిరిసిల్ల ప ట్టణంలో 65 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇల్లంతకుంట మండ లంలో 56 ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌లో  చికిత్స పొందు తూ మరణించాడు. జిల్లాలో ఇప్పటి వరకు 174 మంది మృతి చెందారు. ఈ నెలలో 21 రోజుల్లోనే 38 మంది మరణించారు. ఏప్రిల్‌ 1 వరకు జిల్లాలో 136 మృతులు ఉండగా ఏప్రిల్‌ 21న ఆ సంఖ్య 174కు చేరుకుంది. మరణించిన వారిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో చూస్తే తంగళ్లపల్లిలో ముగ్గు రు, నేరేళ్లలో ఇద్దరు, చీర్లవంచలో ఆరు గురు, కోనరావుపేటలో ఏడుగురు, ఇల్లంతకుంటలో ఆరుగురు, గంభీరావు పేటలో 11 మంది, పోత్గల్‌లో 13, ఎల్లా రెడ్డిపేట 22, వేములవాడ  45, చందు ర్తి ఏడుగురు, బోయినపల్లి ఐదుగురు, విలాసాగర్‌ ఒకరు, సిరిసిల్ల సుందర య్య అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 23 మంది, అంబేద్కర్‌నగర్‌ పరిధిలో 23 మంది మృతిచెందారు. జిల్లాలో ఇ ప్పటి వరకు 16,848 మంది కొవిడ్‌ బా రిన పడ్డారు. 12,446 మంది కోలుకు న్నారు. 4,228 మంది చికిత్స పొందుతున్నారు. 


పాజిటివ్‌ వ్యక్తులపై పర్యవేక్షణ  కరువు

జిల్లా వ్యాప్తంగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను హోం క్వారంటైన్‌లో నిలవరించలేకపోతున్నారు. రెండు మూడు రోజులకే రోడ్లపై తిరుగుతూ కరోనా వ్యాప్తికి దోహదపడుతున్నారు. రాత్రి కర్ఫ్యూ మొదలైనా ఉదయం వేళల్లో మాస్క్‌లు ధరించకపోవడం, రోడ్ల పై గుంపుగుంపులుగా తిరగడం సాధారణంగా మారిపోయింది. దీంతో జిల్లాలో నిత్యం 300 నుంచి 400 వరకు పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఇద్దరు లేదా ముగ్గురు మృతి చెందుతున్నారు. మరోవైపు చాలా వీధుల్లో కరోనా బాధితులు ఉన్నారు.  గడప దాటని వారు కూడా మహమ్మారి బారిన పడడంతో సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందనే భావిస్తున్నా రు. గతంలో మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కొన్ని కేసులు మాత్రమే నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు ఒకే ఊరిలో సగానికి పైగా పాజిటివ్‌ నిర్ధారణ అవుతున్నాయి. 

Updated Date - 2021-04-22T06:17:23+05:30 IST