మూడు రోజుల చిన్నారి కిడ్నాప్.. పట్టుకున్న హాస్పిటల్ స్టాఫ్

Published: Sat, 12 Mar 2022 17:13:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మూడు రోజుల చిన్నారి కిడ్నాప్.. పట్టుకున్న హాస్పిటల్ స్టాఫ్

మూడు రోజుల వయసున్న బాబును ఎత్తుకెళ్లిన జంటను చాకచక్యంగా పట్టుకున్నారు హాస్పిటల్ స్టాఫ్. ఈ ఘటన తమిళనాడులోని కాంచిపురంలో జరిగింది. సుజాతా ప్రభాకరన్ అనే మహిళ ఈ నెల 8న, కాంచిపురం ప్రభుత్వాసుపత్రిలో ఒక బాబుకు జన్మనిచ్చింది. బాబుతోపాటు ఆసుపత్రిలోనే ఉంటోంది. ఈ క్రమంలో పదకొండో తేదీ, శుక్రవారం రోజు సుజాత తన తల్లితో కలిసి వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో తన బాబును చూసుకోమని పక్కన ఉన్నవాళ్లకు చెప్పివెళ్లింది. అయితే, సుజాత తిరిగొచ్చేసరికి చిన్నారి కనిపించలేదు. దీంతో హాస్పిటల్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించారు. 

హాస్పిటల్ గేట్లు మూసి, తనిఖీ చేసి, విచారణ చేపట్టారు. రాము-సత్య అనే జంట బాబును ఎత్తుకెళ్లినట్లు తేలడంతో అప్రమత్తమయ్యారు. ఒక ఆటోలో ఆ బాబును తీసుకెళ్లడం అక్కడున్నవాళ్లు చూశారు. బాబును తీసుకెళ్లిన ఆటో కాస్సేపటికి తిరిగొచ్చింది. దీంతో ఆటోడ్రైవర్‌ను విచారించగా, ఆ జంటను ఎక్కడ విడిచిపెట్టాడో చెప్పాడు. వెంటనే హాస్పిటల్ స్టాఫ్, ఆ జంట దిగిన బస్‌డిపోకు చేరుకున్నారు. అక్కడ బాబుతోపాటు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న జంటను పట్టుకుని, హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. తర్వాత బాబును తల్లికి అప్పగించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.