నలుగురు CBI అధికారులు డిస్మస్.. ఏం చేశారంటే..

Published: Thu, 12 May 2022 19:10:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నలుగురు CBI అధికారులు డిస్మస్.. ఏం చేశారంటే..

న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన నలుగురు CBI అధికారులపై వేటుపడింది. నలుగురు సబ్-ఇన్‌స్పెక్టర్లను డిస్మిస్ చేసినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వీరంతా నగదు దోపిడీ కోసం చండీగఢ్‌లోని ఓ కంపెనీపై నకిలీ సోదాలు చేశారని తేలింది. అవినీతి కేసులో వీరంతా అరెస్ట్ అవ్వడంతో ఈ చర్య తీసుకున్నట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. అవినీతి నిరోధక విధానానికి అనుగుణంగా సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నలుగురు అధికారుల వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా డిస్మిస్‌కు గురయిన అధికారుల పేర్లు సుమిత్ గుప్తా, ప్రదీప్ రాణా, అంకున్ కుమార్, ఆకాశ్ అల్హావత్‌గా వెల్లడించారు. వీరంతా సీబీఐ ఢిల్లీ యూనిట్లలో పని చేస్తున్నారు. నకిలీ సోదాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఈ వేటు పడింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.