వాహ్..! 40 ఏళ్లకే ఆ లిస్ట్‌లో చేరిన నలుగురు Indian Americans.. ఎలా సాధించారంటే..

Sep 20 2021 @ 02:23AM

వాషింగ్టన్: రాజ్ కన్నప్ప, అమిత్ పాలే, అఖిల రామన్, రోహత్ సేత్.. ఈ నలుగురికీ నిండా 40 ఏళ్లు కూడా లేవు. కానీ ఎంతోమంది తమ జీవితంలో సాధించలేని ఓ ఘనతను వీరు నలుగురు సాధించారు. వృత్తి పరంగా వేరు వేరు రంగాల్లో నిష్ణాతులైన వీరు నలుగురు 2021కి గానూ 40 ఏళ్లు నిండకుండా ఫార్ట్యూన్ 40లో స్థానం సంపాదించిన వారుగా రికార్డులకెక్కారు.

వివరాల్లోకి వెళితే.. ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్న ఈ విపత్కర సమయాన్ని దృష్టి ఉంచుకుని ఎంట్రప్రెన్యూర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్, ఎగ్జిక్యూటివ్స్‌గా గొప్ప నైపుణ్యం ప్రదర్శించిన వారిని ఈ దఫా ఫార్ట్యూన్ 40కి ఎంపిక చేశారు. అందులో భాగంగా 2021కి గానూ 40 నిండకుండా ఈ జాబితాలో స్థానం సంపాదించిన వారి లిస్ట్‌లో పైన పేర్కొన్న నలుగురు భారతీయ అమెరికన్లు స్థానం సంపాదించారు. అయితే అసలు వారు నలుగురూ ఎవరు..? ఏలా ఇంత గొప్ప స్థాయిని అందుకోగలిగారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. అమిత్ పాలే:

39 ఏళ్ల అమిత్ పాలే.. యువతలో ఆత్మహత్యలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ట్రెవర్ ప్రాజెక్ట్‌‌తో కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన వందలమందితో ఆయన మాట్లాడిన వారిని మానసికంగా దృఢంగా మార్చారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా నిరోధించారు. 2011లో ట్రెవర్ ప్రాజెక్ట్‌లో చిన్న స్థాయి వాలంటీర్ కౌన్సెలర్‌గా చేరిన అమిత్ ప్రసుతం ప్రాజెక్టుకు సీఈవోగా ఉన్నారు. 22 ఏళ్ల సంస్థ చరిత్రలో ఇలా వాలంటీర్ నుంచి సీఈవోగా ఎదిగిన ఏకైక వ్యక్తి అమిత్ మాత్రమే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఫార్ట్యూన్ 40లో అమిత్‌కు స్థానం దక్కింది.

2. రోహన్ సేత్:

37ఏళ్ల రోహన్ సేత్.. ఓ సోషల్ మీడియా స్టార్టప్‌ను నడుపుతున్నారు. అటు గ్రూప్ చాట్ కాకుండా, ఇటు టాక్ రేడియో కాకుండా రెండింటికీ మధ్యస్తంగా దీనిని ఆయన నిర్వహిస్తున్నారు. క్లబ్ హౌస్ పేరుతో నడుపుతున్న ఈ సోషల్ మీడియా యాప్‌లో ఇప్పటికే ఎన్నో కోట్ల మంది ఉన్నారు. దీని ద్వారా స్నేహితులు సరదాగా చాట్ చేసుకోవడమే కాకుండా ఎంతో విలువైన సలహాలు, సూచనలను మాటల ద్వారా కూడా ఒకరితో మరొకరు పంచుకోగలుగుతారు. ఈ యాప్‌తో ప్రపంచాన్ని ఓ కొత్త మార్గంలో నడిపించేందుకు దోహదపడిన నేపథ్యంలో సేత్‌కు ఫార్ట్యూన్ 40లో స్థానం దక్కింది.

3. కన్నప్ప: 

30 ఏళ్ల యువ భారతీయ అమెరికన్ కన్నప్ప.. యంగ్ అమెరికన్స్ ఫౌండేషన్ ద్వారా సంప్రదాయ పద్ధతుల్లో మార్కెటింగ్ విధానాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించేవారు. యువతకోసం కన్నప్ప చేస్తున్న కృషి ఫలితంగా అతడికి ఫార్ట్యూన్ 40లో స్థానంల లభించింది.

4. అఖిలా రామన్:

39 ఏళ్ల అఖిలా రామన్ వృత్తి పరంగా గోల్డ్‌మ్యాన్ శాచెస్‌‌లో ఉన్న ఇన్వెస్ట్‌ బ్యాంకింగ్ డివిజన్‌కు సీఓఓగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఒప్పందాలు కుదర్చుకోవడం, విలీనాలు, ఆరోపణలను వంటి ఎన్నో విధానాల్లో రామన్‌ది ఆరితేరిన చేయి. ఈ క్రమంలోనే ఆమె సేవలను గుర్తించి ఫార్ట్యూన్ 40లో స్థానం దక్కేలా చేసింది. ఆమె చేసిన కృషికి గానూ ఫార్ట్యూన్ 40లో ఆయనకు స్థానం లభించింది.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.