గుంటూరు మీదుగా 4 ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-09-08T12:54:12+05:30 IST

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా 4 ప్రత్యేక రైళ్లని(special trains ) నడపను న్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి బుధవారం

గుంటూరు మీదుగా 4 ప్రత్యేక రైళ్లు

Guntur: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా 4 ప్రత్యేక రైళ్లని(special trains ) నడపను న్నట్లు డివిజనల్‌ రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు. 07153 నరసపూర్‌-యశ్వంత్‌పూర్‌ రైలు ఈనెల 9, 11 తేదీల్లో మధ్యాహ్నం 3.10కి బయలుదేరి రాత్రి 7.50కి గుంటూరు చేరుకొంటుంది. నెంబరు.07154 యశ్వం త్‌పూర్‌-నరసపూర్‌ రైలు ఈనెల 10, 12 తేదీల్లో మధ్యాహ్నం 3.50కి బయలుదేరి ఉదయం 3.35కి గుంటూరుకు వస్తుంది.

13 రోజులు ఇంటర్‌సిటీ రైళ్ల రద్దు..

నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా కాజీపేట మార్గంలో రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌-గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ రైళ్లని రద్దు చేస్తోన్నట్లు రైల్వే అధికారి పేర్కొన్నారు. నెంబరు. 12705 గుంటూరు - సికింద్రాబాద్‌, నెంబరు. 12706 సికింద్రాబాద్‌ - గుంటూరు రైళ్లని ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-09-08T12:54:12+05:30 IST