వయస్సు చిన్న... జ్ఞాపకశక్తి మిన్న!

ABN , First Publish Date - 2020-11-25T05:30:00+05:30 IST

పీరియాడిక్‌ టేబుల్‌ను గుర్తుంచుకోవడం ఎంత కష్టమో తెలిసిందే. కానీ ఈ నాలుగేళ్ల బుడతడు మాత్రం గడగడా చెప్పేస్తాడు. ఆ ప్రతిభతోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం...

వయస్సు చిన్న... జ్ఞాపకశక్తి మిన్న!

పీరియాడిక్‌ టేబుల్‌ను గుర్తుంచుకోవడం ఎంత కష్టమో  తెలిసిందే. కానీ ఈ నాలుగేళ్ల బుడతడు మాత్రం గడగడా చెప్పేస్తాడు. ఆ ప్రతిభతోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ స్థానం సంపాదించాడు.


  1. పిట్ట కొంచెం కూత ఘనం అన్న సామెత హైదరాబాద్‌కు చెందిన అర్నవ్‌ నాయక్‌కు సరిగ్గా సరిపోతుంది. పీరియాడిక్‌ టేబుల్‌తో పాటు ఎనిమిది గ్రహాల గురించి ఈ చిన్నారి చక్కగా వివరిస్తాడు.
  2. ప్రపంచ పటం ముందు పెడితే 120 దేశాలు గుర్తిస్తాడు. మనదేశంలోని అన్ని రాష్ట్రాలు అడిగిందే తడవుగా చూపిస్తాడు. 
  3. జనరల్‌ నాలెడ్జ్‌లోనూ ఈ బుడతడు తక్కువేం కాదు. 80కి పైగా జనరల్‌ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలకు  తడుముకోకుండా సమాధానం చెబుతాడు. 
  4. నాలుగేళ్ల వయసులో అద్భుతమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్న ఈ చిన్నారికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు దక్కింది. 

Updated Date - 2020-11-25T05:30:00+05:30 IST