మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 40 ఫర్నిచర్ గోడౌన్లు

Published: Sat, 16 Oct 2021 15:49:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 40 ఫర్నిచర్ గోడౌన్లు

థానే: మహారాష్ట్రలోని భివాండిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 40 ఫర్నిచర్ గోడౌన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడి కషేలి ప్రాంతంలోని మహాలక్ష్మి ఫర్నిచర్ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఓ గోడౌన్‌లో అంటుకున్న మంటలు ఒక్కసారిగా చెలరేగి 40 గోడౌన్లకు వ్యాపించాయని, అవన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయని థానే మునిసిపల్ కార్పొరేషన్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్  (ఆర్‌డీఎంసీ) చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. నిన్నటి నుంచి మంటలను అదుపు చేస్తుండగా ఈ తెల్లవారుజామున 4.45 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.