ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొవిడ్‌కు 40 లక్షల మంది మృతి : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-04-17T21:23:52+05:30 IST

న్యూఢిల్లీ : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరోనా మహమ్మారి సమయంలో 40 లక్షలమంది భారతీయులు చనిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొవిడ్‌కు 40 లక్షల మంది మృతి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరోనా మహమ్మారి సమయంలో 40 లక్షలమంది భారతీయులు చనిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ కొవిడ్ మరణాల సంఖ్యను బహిర్గతం చేయాలనుకుంటున్న డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలను భారత్ నిలుపుదల చేస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ ఏప్రిల్ 16న ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం స్ర్కీన్ షాట్‌ను రాహుల్ షేర్ చేశారు. ‘‘ ప్రధాని మోడీ ఎప్పుడూ నిజాలు చెప్పరు. ఎవరినీ చెప్పనివ్వరు. ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని ఇంకా అబద్ధమాడుతున్నారు‘’ అని హిందీలో ట్వీట్ చేశారు. కొవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది చనిపోయారని ఆరోపించారు. గతంలో కూడా ఇదేమాట చెప్పానని అన్నారు. మరణాలకు బాధ్యత వహించి కొవిడ్ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.


డబ్ల్యూహెచ్‌వో లెక్కింపు విధానం సరికాదు : భారత్

దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య లెక్కింపునకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అవలంభిస్తున్న విధానం సరికాదని భారత్ తప్పుబట్టింది. విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద దేశమైన భారత్‌కు ఇలాంటి విధానాలను వర్తించడం సబబుకాదని కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలను భారత్ నిలుపుదల చేస్తోందంటూ న్యూయార్క్ టైమ్స్ ఏప్రిల్ 16న కథనం ప్రచురించిన కథనంపై కేంద్ర వైద్య మంత్రిత్వశాఖ స్పందించింది. మరణాల లెక్కింపు విధానం విషయంలో డబ్ల్యూహెచ్‌వో వద్ద భారత్ పలుమార్లు తన ఆందోళనలను వ్యక్తం చేసిందని కథనం పేర్కొంది. కాగా కేంద్ర వైద్యమంత్రిత్వశాఖ తెలిపిన వివరాలు ఇటివలి మరణాలతో కలిపి ఆదివారం నాటికి భారత్‌లో మృతుల సంఖ్య 5,21,751కు పెరిగింది.

Updated Date - 2022-04-17T21:23:52+05:30 IST