ఉద్యోగం వదిలి ఇంగ్లీష్ కోచింగ్ ప్రారంభించిన యువకుడు.. అతని వద్ద కోచింగ్ తీసుకునే యువతి కిడ్నాప్.. ఆ కిడ్నాప్ ఎవరు చేశారంటే..

ABN , First Publish Date - 2022-03-04T05:38:07+05:30 IST

ఆ యువకుడు కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వదిలేసి కోచింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతని వద్ద కోచింగ్ తీసుకునే ఒక యువతి కిడ్నాప్‌కు గురైంది. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..

ఉద్యోగం వదిలి ఇంగ్లీష్ కోచింగ్ ప్రారంభించిన యువకుడు.. అతని వద్ద కోచింగ్ తీసుకునే యువతి కిడ్నాప్.. ఆ కిడ్నాప్ ఎవరు చేశారంటే..

ఆ యువకుడు కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వదిలేసి కోచింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతని వద్ద కోచింగ్ తీసుకునే ఒక యువతి కిడ్నాప్‌కు గురైంది. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో నివసించే సత్వీర్(40) అనే యువకుడు అయిదేళ్ల క్రితం ఒక కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు. ఆ తరువాత సత్వీర్ ఉద్యోగం మానేసి కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో సోనియా(20) అనే యువతి బీ. ఎడ్. పరీక్షల కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సత్వీర్ వద్ద కోచింగ్ తీసుకునేది. అలా వారిమధ్య పరిచయం ఏర్పడింది. కొంత సమయం తరువాత ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ సోనియా తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. అందుకోసం సోనియాని కోచింగ్ మానేయమని చెప్పారు.


సోనియా కోచింగ్ మానిసినా.. సత్వీర్ ఆమె కోసమని ఆమె గ్రామానికి వెళ్లేవాడు. ఒకరోజు సోనియాతో సత్వీర్ పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. సోనియా తన తల్లిదండ్రులకు తన మేనత్త ఇంటికి వెళుతున్నానని చెప్పి బయలుదేరింది. ఆ తరువాత మేనత్త ఇంటి నుంచి సోనియా తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ప్రేమికులిద్దరూ కలిసి రాజస్థాన్‌లోని అజ్మేర్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ కలిసి కోర్టులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.


మరోవైపు సోనియా తల్లిదండ్రలు ఆమె కనబడపోయేసరికి గ్రామమంతా వెతికారు. గ్రామంలో కొందరు సోనియా ఒక యువకుడితో వెళ్లడం చూశామని చెప్పారు. దీంతో వారు సోనియాని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనియా కిడ్నాప్ కేసులో విచారణ మొదలు పెట్టిన పోలీసులకు అజ్మేర్ పోలీసుల నుంచి సమాచారం అందింది. దీంతో భరత్ పూర్ పోలీసులు సోనియా తల్లిదండ్రులకు విషయం చెప్పారు.


సోనియా తల్లిదండ్రులు అజ్మేర్ పోలీస్ స్టేషన్ వెళ్లగా.. అక్కడ ఆమె సత్వీర్‌తో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. కానీ సోనియాను సత్వీర్ బలవంతంగా పెళ్లికున్నాడని.. తన కంటే 20 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న యువతిని మోసపూరితంగా తీసుకెళ్లాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పాడరు. దీనిపై సోనియా వారిని వ్యతిరేకిస్తూ సత్వీర్‌ను ఇష్టపడే వివాహం చేసుకున్నదని పోలీసులకు చెప్పింది.


Updated Date - 2022-03-04T05:38:07+05:30 IST