పసికందు మృతదేహంతో సహా ఆసుపత్రికి వచ్చిన 15 ఏళ్ల బాలిక.. ఆమె ప్రవర్తన చూసి డాక్టర్లకు అనుమానం.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

Nov 25 2021 @ 14:29PM

రోజుల వయసు ఉన్న పసికందును తీసుకుని ఓ బాలిక ఆస్పత్రికి వెళ్లింది.. ఆ పసికందుకు తానే తల్లినని చెప్పింది.. ఆరోగ్యం బాగోలేదని, చికిత్స చేయమని అడిగింది.. అప్పటికే ఆ పసికందు మరణించింది.. ఆ బాలిక ప్రవర్తన చూసి డాక్టర్లకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.. ఆ బాలిక తనకు పుట్టిన బిడ్డను తనే చంపుకుందని తేలింది.. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


సాగర్ జిల్లాలోని డమోహ్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. ఇద్దరికీ మైనార్టీ తీరలేదు. ఈ ఏడాది జనవరిలో ఇద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో ఆ బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బాలుడిపై అత్యాచారం కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. గత నెల 16వ తేదీన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 22 రోజులు హాస్పిటల్‌లో ఉన్న తర్వాత ఇంటికి వెళ్లింది. 


ఈ నెల 10వ తేదీ రాత్రి తన బిడ్డను తీసుకుని ఆ బాలిక స్థానిక పీహెచ్‌సీకి వెళ్లింది. అప్పటికే ఆ పసికందు మరణించింది. వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆ బాలిక తన తప్పును అంగీకరించింది. తాడుతో గొంతు నులిమి చంపేసినట్టు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను బాలికల జువైనల్ హోమ్‌కు తరలించారు. 


 

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.