ఈ ఫోన్ తీసుకుని తనకు కొత్త స్మార్ట్ఫోన్ ఇవ్వాలని భీమ్ సింగ్ సర్వీస్ సెంటర్ వారిని కోరాడు. అయితే.. అది తమ పాలసీకి విరుద్ధమని, కొత్త ఫోన్ ఇవ్వడం కుదరదని మొబైల్ కంపెనీ సర్వీస్ సెంటర్ వారు తేల్చి చెప్పారు. తనకు కొత్త ఫోన్ ఇవ్వాలని పలుమార్లు సర్వీస్ సెంటర్కు వెళ్లి భీమ్ సింగ్ అడిగినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో.. ఇక లాభం లేదనుకుని భావించిన భీమ్ సింగ్ ఓ ఖాళీ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లి తనకు కొత్త ఫోన్ ఇవ్వాలని సర్వీస్ సెంటర్ వాళ్లను నిలదీశాడు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో మాల్లోనే.. సర్వీస్ సెంటర్ ఎదుటే మీద పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. భీమ్ సింగ్ను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 40 శాతం కాలిన గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని రోహిణి డీసీపీ పీకే మిశ్రా తెలిపారు.