44 ఏళ్ల లోపువారికి టీకా వాయిదా : మంత్రి సుధాకర్‌

ABN , First Publish Date - 2021-05-11T16:49:45+05:30 IST

రాష్ట్రంలో 18-44ఏళ్లవారికి వ్యాక్సినేషన్‌ను లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ ప్రకటించారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలలోనూ వ్యాక్సిన్‌ వేస్తా

44 ఏళ్ల లోపువారికి టీకా వాయిదా : మంత్రి సుధాకర్‌


బెంగళూరు: రాష్ట్రంలో 18-44ఏళ్లవారికి వ్యాక్సినేషన్‌ను లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ ప్రకటించారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలలోనూ వ్యాక్సిన్‌ వేస్తామని ప్రకటించి తెల్లారేసరికి మాట మార్చారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత లేదని అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సక్రమంగా అమలు చేయాలంటే వ్యాక్సిన్‌ వేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 14రోజుల తర్వాత వ్యాక్సినేషన్‌ చేస్తామన్నారు. ఈమేరకు రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్‌ బొమ్మైతో చర్చించి రాష్ట్రంలో ఆక్సిజన్‌ సమస్యపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌తో వీడియో కాన్ఫెరెన్స్‌లో వివరించానన్నారు. హాసన్‌లో కొవిడ్‌ సమస్యపై మాజీ ప్రధాని దేవేగౌడ, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గోపాలయ్యలతో ఫోన్‌లో చర్చించానన్నారు.

Updated Date - 2021-05-11T16:49:45+05:30 IST