America లో ఒకే నెలలో 45 లక్షల మంది ఉద్యోగాలకు గుడ్‌బై

ABN , First Publish Date - 2022-01-06T13:40:55+05:30 IST

అమెరికాలో ఉద్యోగాలు మానేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అమెరికా కార్మిక శాఖ అంచనా ప్రకారం... గత నవంబరులో అత్యధికంగా 45 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. సెప్టెంబరుతో పోల్చుకుంటే వీరి సంఖ్య 3శాతం పెరిగింది. ఫుడ్‌ సర్వీసెస్‌, హెల్త్‌, ట్రాన్స్‌పోర్ట్‌ రంగాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉద్యోగాలు మానేస్తున్నారు.

America లో ఒకే నెలలో 45 లక్షల మంది ఉద్యోగాలకు గుడ్‌బై

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాలు మానేస్తున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అమెరికా కార్మిక శాఖ అంచనా ప్రకారం... గత నవంబరులో అత్యధికంగా 45 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. సెప్టెంబరుతో పోల్చుకుంటే వీరి సంఖ్య 3శాతం పెరిగింది. ఫుడ్‌ సర్వీసెస్‌, హెల్త్‌, ట్రాన్స్‌పోర్ట్‌ రంగాల్లో పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉద్యోగాలు మానేస్తున్నారు. మరింత మెరుగైన వేతనం లభించే కొత్త ఉద్యోగాల కోసమే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు అమెరికాలో అందుబాటులోకి వస్తున్న ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతోంది. గత అక్టోబరు నాటికి 1.11 కోట్ల ఉద్యోగాలు అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. నవంబరు నాటికి ఈ సంఖ్య 1.6 కోట్లకు చేరింది. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, ఫలితంగా జాబ్‌ మార్కెట్‌ పుంజుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-01-06T13:40:55+05:30 IST