4,500 మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్ అధినేత

ABN , First Publish Date - 2022-03-01T00:04:55+05:30 IST

ఇక రష్యాకు చెందిన సైనికులను ఉక్రెయిన్ విడిచిపెట్టి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని జెలెన్‌స్కీ హెచ్చరిస్తున్నారు. రష్యా ప్రభుత్వం పేరు ఎత్తకుండా ‘‘మీ కమాండర్స్ చెప్పేవి నమ్మకండి. మీవాళ్లు చేసే ప్రచారాన్ని నమ్మకండి. మీ ప్రాణాలు ముఖ్యం..

4,500 మంది రష్యా సైనికులు మృతి: ఉక్రెయిన్ అధినేత

కీవ్: ఉక్రెయిన్‌పై దండెత్తి వచ్చిన రష్యా సైనికుల్లో 4,500 మంది మరణించారని ఆ దేశాధినేత వోలోమిర్ జెలెన్‌స్కీ అన్నారు. అయితే గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో 16 మంది చిన్నారులు చనిపోయారని, 45 మంది గాయపడ్డారని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఏడుగురు చిన్నారులు సహా 102 మంది పౌరులు ఉక్రెయిన్‌‌లో చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఈ సంఖ్య ఇంతకు మించి ఉంటుందని జెనీవా కేంద్రంగా నడుస్తోన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి పేర్కొంది.


ఇక రష్యాకు చెందిన సైనికులను ఉక్రెయిన్ విడిచిపెట్టి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని జెలెన్‌స్కీ హెచ్చరిస్తున్నారు. రష్యా ప్రభుత్వం పేరు ఎత్తకుండా ‘‘మీ కమాండర్స్ చెప్పేవి నమ్మకండి. మీవాళ్లు చేసే ప్రచారాన్ని నమ్మకండి. మీ ప్రాణాలు ముఖ్యం. అవి కాపాడుకోవాలంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి’’ అని ఆయన అన్నారు. ఇక యూరోపియన్ యూనియన్‌లో ప్రత్యేక విధానం ద్వారా ఉక్రెయిన్ తక్షణమే సభ్వత్వం ఇవ్వాలని జెలెన్‌స్కీ కోరారు.

Updated Date - 2022-03-01T00:04:55+05:30 IST