Liberation: 30ఏళ్లలో కువైత్ ఎంతమంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించిందంటే..

ABN , First Publish Date - 2021-12-25T18:57:24+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ 1991లో తీసుకువచ్చిన లిబరేషన్ కార్యక్రమంలో భాగంగా 2021 వరకు అంటే సుమారు 20 ఏళ్లలో దాదాపు 4.61 లక్షల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది.

Liberation: 30ఏళ్లలో కువైత్ ఎంతమంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించిందంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ 1991లో తీసుకువచ్చిన లిబరేషన్ కార్యక్రమంలో భాగంగా 2021 వరకు అంటే సుమారు 30 ఏళ్లలో దాదాపు 4.61 లక్షల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది. 1991 ఫిబ్రవరి నుంచి 2021 నవంబర్ వరకు 4,61,000 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించినట్లు అక్కడి ఓ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా, వీరిలో కొంతమంది రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని సమాచారం. బహిష్కరణలకు సంబంధించిన కరెక్షనల్ ఇన్సిట్యూషన్స్ డిపార్ట్‌మెంట్, తాత్కాలిక డిటెన్‌షన్ అఫైర్స్ డేటా ప్రకారం ఈ నివేదికను విడుదల చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. 


వివిధ ఉల్లంఘనలు, నేరాల్లో వీరందరూ న్యాస్థానంలో దోషులుగా తేలినవారేనని రిపోర్ట్ చెబుతోంది. వారి నేరాలకు పడిన శిక్షకాలంను పూర్తి చేసుకున్న తర్వాత వారివారి దేశాలకు పంపించినట్లు తెలిపింది. ఇదిలాఉంటే.. గతకొంత కాలంగా కువైత్ ప్రవాసుల పట్ల కువైటైజేషన్, ఇతర కార్యక్రమాల పేరుతో కఠినంగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. ప్రవాసుల కారణంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయనేది అక్కడి నిపుణుల అభిప్రాయం. దీనిలో భాగంగానే వలసదారుల నివాస, పని అనుమతులకు సంబంధించి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. 

Updated Date - 2021-12-25T18:57:24+05:30 IST