ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 481 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-23T04:37:55+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో శనివారం 481 కరోనా కేసులు వెలుగుచూశాయి.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 481 కరోనా కేసులు

మెదక్‌అర్బన్‌/సంగారెడ్డిఅర్బన్‌/సిద్దిపేట/తొగుట,జనవరి22: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో శనివారం 481 కరోనా కేసులు వెలుగుచూశాయి. మెదక్‌ జిల్లాలో 645 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నర్సాపూర్‌లో 38, తూప్రాన్‌లో 36, మెదక్‌లో 29, రామాయంపేటలో 19, వెల్ధురిలో 6, శివ్వంపేటలో 6, పాపన్నపేటలో 6, పెద్దశంకరంపేటలో 5, నార్సింగిలో 5, రేగోడ్‌కలో 5, రెడ్డిపల్లిలో 4, టేక్మాల్‌లో 4, చిన్నశంకరంపేటలో 3, రంగంపేటలో 3, అల్లాదుర్గంలో 2, సర్ధనలో 1, కౌడిపల్లిలో 2 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మెదక్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో 1,716 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా 99 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పటాన్‌చెరులో 35, సంగారెడ్డి-25, జహీరాబాద్‌-15, నారాయణఖేడ్‌-15, బొల్లారం-2, కంది-2, గుమ్మడిదల-2, ఆర్సీపురంలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాఽధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 2,180 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 208 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పీహెచ్‌సీల వారీగా తొగుటలో 2, చిన్నకోడూరులో 4, ఇబ్రహింనగర్‌లో 5, పుల్లూరులో 7 కేసులు నమోదయ్యాయి. కాగా ఇంటింటి సర్వేలో 981 టీంలు 55,688 ఇళ్లలో సర్వే నిర్వహించారు. 1,189 మందిలో లక్షణాలు కనిపించడంతో అందరికీ కిట్స్‌ను అందజేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. సిద్దిపేట జీజీహెచ్‌లో ఐదుగురు ఇన్‌పేషంట్లుగా చేరినట్లు తెలిసింది. 

Updated Date - 2022-01-23T04:37:55+05:30 IST