అయితే ఈ లోపం కారణంగా ఆమె చదువుకు ఆటకం కాలేదు. బీఈడీ పూర్తి చేశారు. ఇక వరుని విషయానికొస్తే అతని పేరు రమేస్ భాయీ డాంగర్(42). ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. రమేష్‌కు ఎవరి ద్వారానో శాంతా గురించి తెలిసింది. దీంతో ఆమెను కలుసుకుని పెళ్ళికి ప్రతిపాదించారు. ఈ వివాహానికి ఆమె ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరికీ నవంబరు 30న వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైనవారంతా వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.