మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవులు

Mar 10 2021 @ 18:11PM

అమరావతి: మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సాధారణ సెలవులు (సీఎల్‌) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 15 రోజుల సెలవులకు అదనంగా సీఎల్‌లు అమలు చేసేందుకు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగినులకు ఈ అదనపు సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వెసులుబాటు కల్పించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మహిళా అధ్యాపకులు, లెక్చరర్లకూ అదనపు సీఎల్‌లు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.