total knee replacement surgery: మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేవారు ముందుగా తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు.. ఏంటంటే..!

ABN , First Publish Date - 2022-09-27T18:23:47+05:30 IST

మోకాలి మార్పిడి చేసిన తరువాత కోలుకున్న రోగి త్వరలోనే కోలుకుని తన పనులు తనే చేసుకునే వీలు ఉంటుంది.

total knee replacement surgery: మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేవారు ముందుగా తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు.. ఏంటంటే..!

ఈ రోజుల్లో తీవ్రమైన మోకాలి సమస్యలతో బాధపడుతున్నవారికి చికిత్స చేయడానికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు కీలకంగా మారాయి. ఈ మార్పిడి రోగి తొడ ఎముక, షిన్ బోన్, మోకాలిచిప్పను తీసివేసి, గాయపడి అరిగిన ఎముక మృదులాస్థి స్థానంలో లోహంతో తయారైన ప్రీమియం ప్లాస్టిక్, పాలిమర్ లతో కృత్రిమ కీలు ప్రొస్థెసిస్  (prosthesis) ద్వారా భర్తీ చేసే శస్త్ర చికిత్స చేస్తారు. ఇటీవలి కాలంలో ఆర్థోపెడిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఇది వయస్సుతో వచ్చే సమస్య. యోగా, జిమ్ లలో వ్యాయామాలు చేయడం ఆరుబయట వ్యాయామాలు చేయడం వంటి శరీరక శ్రమలు చేయడానికి సమయం ఇవ్వకపోవడం రోజంతా కుర్చీలలో కూర్చిని, కంప్యూటర్ స్క్రీన్ ముందు పనిచేసేవారిలో స్థిరమైన జీవనశైలి ప్రధాన కారణం కావచ్చు. 

  

ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నించోవడం వల్ల నొప్పి పెరగడం, కండరాల క్షీణత, వైకల్యంగా మొదలై శస్త్రచికిత్స తర్వాత మోకాలిని పూర్తిగా నిటారుగా ఉంచే సామర్థ్యం తగ్గుతుంది. మోకాలి మార్పిడి చేసిన తరువాత కోలుకున్న రోగి త్వరలోనే కోలుకుని తన పనులు తనే చేసుకునే వీలు ఉంటుంది. అయితే శస్త్ర చికిత్స తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే..


1. ఈ మోకాలి మార్పిడిలో చాలా రకాలున్నాయి. 

రోగి పరిస్థితిని బట్టి అతనికి సరిపడే శస్త్ర చికిత్సను అందిస్తారు. 


2. మొత్తం మోకాలి మార్పిడి..

50 సంవత్సరాల పై వయసుల వారికి చేస్తారు కానీ 50 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నవారికి ఈ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయరు. పరిస్థితిని బట్టి రోగికి ఉండే అవసరాన్ని బట్టి మాత్రమే చిన్నవయసువారిలో ఈ చికిత్స చేయడం జరుగుతుంది. 

 

3. త్వరగా కోలుకోవాలంటే...

శస్త్ర చికిత్స తర్వాత సాఫీగా కోలుకోవాడానికి మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్యసమస్యలను రోగి నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న మొత్తంలో బరువు తగ్గడం కూడా కోలుకోవడానికి సహాయపడుతుంది. 


4. శస్త్ర చికిత్సలో ఆలస్యం కష్టం కలిగిస్తుంది.

ఎక్కువసేపు ఆలస్యం చేయడంతో నొప్పి మరింత పెరిగే అవకాశం ఉంది. కండరాల క్షీణత, వైకల్యం శస్త్రచికిత్స తర్వాత మోకాలిని పూర్తిగా నిటారుగా చేసే సామర్థ్యం తగ్గుతుంది. చికిత్స ఆలస్యం వల్ల రికవరీ అవకాశాలను తగ్గిస్తుంది. 


5. సమస్యలను తెలుసుకోండి.

శస్త్రచికిత్స తరువాత వచ్చే సమస్యల గురించి రోగి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇందులో రక్తం గడ్డకట్టడం, శ్వాస సమస్యలు రావచ్చు. మోకాలిలో నొప్పి, ఎరుపు, వాపు, సున్నితత్వం పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

Updated Date - 2022-09-27T18:23:47+05:30 IST