బండి సంజయ్‌ చచ్చినా 5లక్షలు!

ABN , First Publish Date - 2022-04-13T07:16:50+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రైతుబంధు సమితి

బండి సంజయ్‌ చచ్చినా 5లక్షలు!

  • ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా
  • సీఎంను తిట్టి వార్తల్లోకెక్కాలనుకుంటున్నారు
  • రైతులు ఆగ్రహిస్తే రాళ్లతో కొట్టిచంపుతారు
  • రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా ఫైర్‌
  • బాలరాజు, జీవన్‌రెడ్డితో కలిసి ప్రెస్‌మీట్‌


 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తోందని, ఒకవేళ బండి సంజయ్‌ చచ్చినా.. రైతుబీమా కింద ఆయన కుటుంబానికి రూ.5 లక్షలు వస్తాయని అన్నారు. అయితే ఆయన చావాలని మాత్రం తాము కోరుకోవడం లేదన్నారు. మంగళవారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, పీయూసీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పల్లా మీడియా సమావేశంలో మాట్లాడారు.


రైతుల కోసం తమ పార్టీ ఓవైపు ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తుంటే.. బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌ను తిట్టి వార్తల్లోకెక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం అనే గౌరవం లేకుండా నోటికొచ్చినట్లు దూషించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలేని పదజాలంతో దూషించారు. గుజరాత్‌ నాయకులకు గులాములా కాకుండా.. దమ్ముంటే తెలంగాణ రైతాంగం ప్రయోజనం పొందేలా ఽకేంద్రం ద్వారా ధాన్యం కొనేలా చూడాలని సవాల్‌ విసిరారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతినాడు బండి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించడం.. ఆ మహానీయుడి ఆత్మను క్షోభ పెట్టడమేనన్నారు. తెలంగాణ రైతులు ఆగ్రహావేశాలకు లోనైతే.. బండి సంజయ్‌ను రాళ్లతో కొట్టి చంపడం ఖాయమన్నారు. రైతుల ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, అదానీ కోసమే నల్లచట్టాలు తెచ్చిన ఆ పార్టీకి కేంద్రంలో, రాష్ట్రంలో టు లెట్‌ బోర్డు పడక తప్పదని హెచ్చరించారు ుూమిమ్మల్ని ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తారా? దమ్ముంటే మాపై దాడులు చేయించాలి్‌్‌ అని సవాల్‌ విసిరారు.


బండి సంజయ్‌ గోధుమలు, వడ్లకు తేడా తెలియని హీనుడని విమర్శించారు. బీజేపీ దొంగలపై రైతులు దంగల్‌ ప్రకటించారని, అందులో భాగంగానే నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ ఇంటి ముందు వడ్లు కుప్పలుగా పోసి నిరసన చాటారని తెలిపారు. 


Updated Date - 2022-04-13T07:16:50+05:30 IST