
ట్రినిడాడ్: అండర్-19 ప్రపంచకప్‌లో ఆడుతున్న భారత యువ జట్టును కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఆటగాళ్లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో గత మ్యాచుల్లో కెప్టెన్ యశ్ ధుల్ సహా కీలక ఆటగాళ్లు దూరమయ్యారు.
తాజాగా మరోమారు నిర్వహించిన పరీక్షల్లో ఒక్క వాసు వత్స్‌కు మాత్రమే నెగటివ్ వచ్చింది. మిగతా ఐదుగురికీ పాజిటివ్‌గానే తేలడంతో వారు ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దీంతో రేపు ఉగాండాతో జరగనున్న మ్యాచ్‌కి కూడా ఈ ఐదుగురు ఆటగాళ్లు దూరమైనట్టే.
నెగటివ్ వచ్చిన వాసు మాత్రం రేపటి (శనివారం) మ్యాచ్ కోసం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. కాగా, కెప్టెన్ యశ్‌ధుల్ కరోనా కారణంగా జట్టుకు దూరం కావడంతో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నిశాంత్ సింధు జట్టుకు సారథ్యం వహించాడు.
ఇవి కూడా చదవండి