రూ.50 కోట్లతో 50 హ్యాపీ మొబైల్‌ స్టోర్లు

ABN , First Publish Date - 2022-01-20T06:27:24+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో హ్యాపీ మొబైల్స్‌ మరిన్ని మొబైల్‌ విక్రయ కేంద్రాలను ఏర్పా టు చేయనుంది. ప్రస్తుత ఏడాదిలో రెండు రాష్ట్రాల్లో కొత్తగా

రూ.50 కోట్లతో 50 హ్యాపీ మొబైల్‌ స్టోర్లు

మార్కెట్లోకి షామీ 11టీ ప్రో 5జీ ఫోన్‌ విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తెలుగు రాష్ట్రాల్లో హ్యాపీ మొబైల్స్‌ మరిన్ని మొబైల్‌ విక్రయ కేంద్రాలను ఏర్పా టు చేయనుంది. ప్రస్తుత ఏడాదిలో రెండు రాష్ట్రాల్లో కొత్తగా 50 స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 75 స్టోర్లు ఉన్నాయి. కొత్తగా హైదరాబాద్‌లో 15, విజయవాడ, విశాఖపట్నంలలో 10, ఇతర పట్టణాల్లో 25 స్టోర్లను నెలకొల్పనున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు రూ.500 కోట్లకు చేరనున్నాయని, 2022-23లో రూ.750 కోట్ల టర్నోవర్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 


షామీ 11టీ ప్రో 5జీ మొబైల్‌ ఫోన్‌ను హ్యాపీ స్టోర్లలో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఫోన్‌ను విడుదల చేయడానికి షామీతో హ్యాపీ మొబైల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అన్ని హ్యాపీ మొబైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. 8జీబీ, 128 జీబీ ఫోన్‌ ధర  రూ.39,999. 8జీబీ, 256 జీబీ ఫోన్‌ ధర రూ.43,999. కొనుగోలుదారులు రూ.5,000 వరకూ ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చని, మరో రూ.5,000 వరకూ ఎక్స్ఛేంజీ ఆఫర్‌ కూడా ఉందని పవన్‌ తెలిపారు. రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా 3 డే ఫ్లాష్‌ సేల్‌ను ప్రకటించినట్లు చెప్పారు.  

Updated Date - 2022-01-20T06:27:24+05:30 IST